త్రుటిలో తప్పిన ప్రమాదం..పెద్ద బజారులో నేలకొరిగిన భారీ వేప చెట్టు
30-07-2026 12:52 PM
సిరిసిల్ల, జులై 30( విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉదయం భారీ వేప చెట్టు ఒక్కసారిగా నేలకొరిగింది. అదే సమయంలో అక్కడ ఆగి ఉన్న టాటాఏసీ,తో పాటు ఓ మినీ వ్యాన్‌పై చెట్టు పడింది.వ్యాన్‌లో ఉన్న వ్యక్తికి గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీసుకొచ్చారు.అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు, చెట్టు కూలడంతో విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి.అయితే ఘటన సమయంలో అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చెట్టును తొలగించే పనులు చేపట్టారు.






