11 March, 2026 | 8:16 AM

గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి

11-03-2026 12:08 AM

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

సూర్యాపేట, మార్చి 10 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ.60 పెంచిందని వెంటనే దాన్ని తగ్గించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంచిన వంటగ్యాస్ తరాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధర రూ.116 పెంచడం సరికాదన్నారు. చమురు నిలవలు తగ్గితే ఇరాన్ నుంచే చమురు దిగుమతికి ఆటంకాలు కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు అగ్గిపుల్ల లేకుండానే మండిపోతాయన్నారు. అమెరికాకు తల్లోగ్గి రష్యా నుంచి దిగుమతులు నిలిపివేసిన పర్యవసన ఫలితమిదన్నారు. దీని మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలం నుండి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరను ఇష్టానుసారంగా పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో మళ్లీ కట్టెల పొయ్యి వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.    పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట్ చంద్ర ,ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, సిఐటియు శ్రామిక మహిళా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత,  అంగన్వాడి టీచర్ భాస్కరమ్మ జిల్లా ఆఫీస్ బేరర్ షేక్ ఖాజాభి తదితరులు పాల్గొన్నారు.