నిర్లక్ష్యపు నీడలో కస్తూర్బాలు!
9 నెలల గర్భంతోనే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిని
అయినా గుర్తించలేని అధికారులు
ప్రసవం అనంతరం ఘటన వెలుగులోకి
వారం రోజులైనా బాధ్యులపై చర్యలకు వెనకడుగు
ప్రైవేటు పాఠశాలలకు ఊతమిచ్చేలా కస్తూర్బాలపై నిర్లక్ష్యం.
బాధులను కాపాడుతున్నదెవరు..?
నాగర్కర్నూల్, మార్చి 10 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలు నిర్లక్ష్యపు నీడన కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరుగుతోంది. దీంతో కస్తూర్బా పాఠశాలలకు విద్యార్థులు చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన బా లికలు అత్యధిక శాతం 10, ఆ తర్వాత ఇం టర్ ఉన్నత చదువులకు కస్తూర్బాలు వేదికగా మారుతున్నాయి. దానికి తోడు ప్రభు త్వాలు కూడా నాణ్యమైన విద్యతోపాటు భోజనం కూడా అందించాలన్న ఉద్దేశంతో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని భా రీగా నిధులు కేటాయించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా ప్రైవేటు పాఠశాల ఉత్తీర్ణత శాతం హాజరు శాతం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కొంతమంది బడి దొంగలు, ఉన్నత వర్గాలకు చెందిన కస్తూర్బా పాఠశాల టీచర్లు, ప్రత్యేక అధికారులు క్రమంగా కస్తూ ర్బా పాఠశాలల ప్రాధాన్యత తగ్గించాలన్న కుట్రకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను వారి సామర్థ్యాల ను ఎప్పటికప్పుడు పరిశీలించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యను అందించాల్సిన బాధ్యత ఉంది.
దాంతోపాటు మెరుగైన భోజనం అందించేందుకు మెనూ పకడ్బందీ అమలుపరిచేలా పర్యవేక్ష ణ చేయాల్సి ఉంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి మెరుగుప రిచేందుకు రక్తహీనత నుండి కాపాడేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ పర్యవేక్షించాల్సిన కొంతమంది అధికారులు ఉన్నత వర్గాల వారితో, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ముకా స్తూ కస్తూర్బా పాఠశాలల పర్యవేక్షణ గాలికి వదిలేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు పాఠశాలల నుండి తరచు ముడుపులు ముట్టజెప్పే వ్యక్తుల మాటలు నమ్మి జి ల్లా విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. దానికి తోడు అనుకూలంగా ఉన్న ప్రత్యేక అధికారు లు, సిఆర్టి లను గూడచారి వ్యవస్థగా ఏర్పా టు చేసుకొని వారికి అనుకూలంగా వ్యవహరించే వారికి అందలమెక్కిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసే వారిని టార్గెట్ చేసి మరీ హింసకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు విద్యార్థులకు అందించాల్సిన భోజనం పంపిణీ చేసే సరుకుల విషయంలో ఎక్కువ శాతం పంపిణీ చే సినట్లు రికార్డులు ఎక్కించి, చేయని పనులకు నకిలీ బిల్లులు సృష్టించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్ర విమర్శలు ఉ న్నాయి. జిల్లా డీఈవో కార్యాలయంలో కొం తమంది అక్రమంగా డిప్యూటేషన్ పై చొరబడి ఇలాంటి బడి దొంగలకు బద్ధకస్తులకు వంత పాడుతున్న వారు కూడా లేకపోలేదని విమర్శలున్నాయి. కొంత కాలంగా కస్తూర్బా పాఠశాలలో తరచూ అవినీతి అక్రమాలు, నెలల తరబడి పాఠశాలకు వెళ్లకపోయినా న కిలీ హాజరు రిజిస్టర్లు నమోదు చేస్తూ తప్పించుకు తిరిగారిగిన వారు ఉన్నారు.
విద్యార్థులు స్నానం గదుల్లోకి వెళ్లి వీడియో రికార్డులు చేసి ఇతరులకు పంపిన టీచర్లపై కూడా చర్యలకు వెనుకబడిన పరిస్థితి. తిమ్మాజిపేట మండలం కస్తూర్బా పాఠశాలలో సీఆర్పీలు ప్రత్యేక అధికారుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నప్పటికీ విద్యాశాఖ అ ధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు వారి మధ్య నలిగిపోతున్నారు. తాజా గా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ కస్తూర్బా పాఠశాలలో సుమారు 9 నెలల పాటు గ ర్బం దాల్చిన బాలిక అక్కడే ఉన్నప్పటికీ గుర్తించలేకపోయారు. చివరికి ప్రసవం అనంతరం ఈ ఘటన వెలుగులోకి రాగా సుమా రు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సదరు కస్తూర్బా పాఠశాల బాధ్యులపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
బాధ్యులను వెనకేసుకొస్తున్నది ఎవరు..?
సుమారు బద్దకస్తులు, బడి దొంగలు పనిచేస్తున్న పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు దాదాపు కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అ ధికంగా ఉన్నాయని బాహాటంగా విమర్శలు ఉన్నాయి. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతంలోనే వరుస ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కేవలం ప్రచారాలు ప్రకటనలకే పరిమి తం అవుతున్నారని ఈ వరుస ఘటనలతో మరోసారి రుజువైంది.
9 నెలల పాటు స దురు పాఠశాలలోనే ఉన్న బాలికను కనీసం తోటి బాలికలు, క్లాస్ టీచర్లు, వైద్య పరీక్షలు అందించే వైద్య సిబ్బంది, భోజనం అందించే వంట ఏజెన్సీలు, చివరగా పర్యవేక్షణ చేయాల్సిన ప్రత్యేక అధికారి, జిల్లా అధికారి సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేటతెల్లమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణ కోసం వచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారుల ముందే మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. ఉడికి ఉడకని అన్నం వడ్డించి తమ నిర్లక్ష్యాన్ని అధికారి ముందే రుజువు చేసుకున్నారు.
అనంతరం పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కి అందించగా ఇప్పటి వరకు సదరు అధికారులపై, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం జంకుతున్న పరిస్థితి. దీని వెనక రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెర వెనుక కాపాడుతున్నారా తన పేరు చెప్పుకొని కిందిస్థాయినేతలే కాపాడుతున్నారా అ న్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నా యి. కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిని ఉన్నత వర్గానికి చెందినవారు కావడంతోనే ఆ వర్గం రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతోందని విమర్శలు ఉన్నాయి.




