ఎంపీడీవో కార్యాలయంలో జన్మదిన వేడుకలు
20-04-2026 02:53 PM
బోథ్,(విజయక్రాంతి): మండల అభివృద్ధి అధికారి రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన కార్యాలయంలో మాల సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.






