5 March, 2026 | 7:25 PM

గిరిజన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

05-03-2026 06:02 PM

ఉప్పనుంతల మండలంలోని ఓ గ్రామంలో ఘాతుకం

నిందితులపై ఫోక్సో, అట్రాసిటీ కేసు నమోదు

అచ్చంపేట: గిరిజన మైనర్ బాలికపై ఇద్దరు కామాందులు.. విచక్షణ మరచి అఘాయియిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) ఉప్పనుంతల మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో కొద్ది రోజులుగా లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా ప్రతీ రోజు సాయంత్రం వేళా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిని తిలకించేందుకు స్థానికులు, సమీప ప్రజలు వస్తుంటారు.

అందులో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రామాన్ని తిలకిచేందుకు గ్రామానికి చెందిన ఓ గిరిజన కుటుంబం బాలికతో సహా హాజరైంది. వీరి ఇల్లు ఆలయ సమీపంలోనే ఉండటంతో.. దాహర్తి తీర్చకునేందుకు తాగేందుకు నీళ్లు తీసుకురమ్మని బాలికకు కుటుంబ సభ్యులు సూచించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో బాలిక ఇంటికి వెళ్తుండగా... గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె నోరును అదిమిపెట్టి సమీపంలోని ఓ రేకుల షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుల్లో ఓ మండలంలోని కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగని ఆరోపించారు. బాధిత బాలిక జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మదో తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

కేసు నమోదు.. ధర్యాప్తు ప్రారంభం

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై ఉప్పనుంతల పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. నిందితులపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ధర్యాపు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు ఠాణాకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామన్నారు.