05-02-2026 01:04:54 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): గండిపేటలోని శివాలయం ప్రథమ వార్షికోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్ఛార్జ్ కార్తీక్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నార్సింగి సర్కిల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. విష్ణువర్ధన్‌రెడ్డి, గండిపేట మాజీ సర్పంచ్ ప్రశాంత్ యాదవ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముక్తార్, మాజీ సర్పంచ్ నరసింహ, హరిశంకర్, గణేష్ ముదిరాజ్, మల్లేష్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.