05-02-2026 01:03:46 AM
రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
మెదక్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతామనే భయంతో బీఆర్‌ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాషపై, పాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
‘రేవంత్‌రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహా నేత కేసీఆర్ అని, పీసీసీ పదవిని 50 కోట్లకు కొన్న చరిత్ర నీది అని అన్నారు. ‘బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా..
ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ.2,500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబర్దార్’ అని హెచ్చరిం చారు. ‘ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు కడుతారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరు’ అని అన్నారు.