సేవా కార్యక్రమాలతో గంప శశాంక్ జన్మదిన వేడుకలు
ప్రభుత్వఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్‌ఎస్ నాయకులు
దోమకొండ, జూలై 26 (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో రాష్ట్ర బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు గంప శశాంక్ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గంప శశాంక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ప్రజాసేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, మండల యువజన విభాగం అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్, పట్టణ అధ్యక్షుడు బోరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు కానుగంటి నాగరాజు, చిట్యాల రాజిరెడ్డి, ఐరేని రాజేందర్, చెన్నుగారి నర్సింలు, నిమ్మ రాజనర్సు, విజయ్, కిరణ్, వినోద్, మద్ద వినయ్, రోహిత్, సూరం రాము తదితరులు పాల్గొన్నారు.






