క్యాంపస్ షూకేస్ ఆవిష్కరించిన గంభీర్
న్యూఢిల్లీ, మే 19: భారత క్రికెటర్లు ఐపీఎల్‌తో బిజీగా ఉండడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బ్రాండ్ ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ క్యాంపస్‌కు చెందిన షూకేస్ 2026ను గంభీర్ ఆవిష్కరించారు. క్యాంపస్ కొత్త బ్రాం డ్ గుర్తింపును అందరికీ పరిచయం చేశారు.
మూడు రోజుల పాటు జరిగిన క్యాంపస్ షూకే స్ కార్యక్రమంలో గంభీర్ ప్యానెల్ డిస్కషన్స్ లో పాల్గొని తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌తో చాలా మంది ఆటగాళ్లకు ఆర్థికపరంగా సపోర్ట్ దొరుకుతోందని, గతంలో మాత్రం స్పాన్సర్ల కోసం ఇబ్బందిపడిన సందర్భాలు చాలా మంది క్రికెటర్లకు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా యువతకు గంభీర్ కీలక సూచనలు చేశారు.
విజయం అవేది ఒకే మార్గాన్ని అనుసరించడం కాదనీ, లక్ష్యాన్నికి కట్టుబడి ఉండడంతో పాటు ప్రయాణాం ఎలా మారినా ముందుకు సాగాలన్నదే క్రీడల నుంచి నేర్చుకోవాలని సూచించారు. నేటి యువత మనస్తత్వాన్ని ప్రతిబింబించే క్యాంపస్ లాంటి బ్రాండ్ తన లైఫ్‌స్టుల్‌కు దగ్గరగా ఉంటుందన్నారు. రెండు దశాబ్దాలకుపైగా స్వదేశీ బ్రాం డ్ అంచెలంచెలుగా ఎదగడం కంపెనీ సమర్థతకు నిదర్శన మని గంభీర్ కితాబిచ్చారు. తమ ప్రయాణం లో మద్ధతు ఇచ్చిన వారందరికీ క్యాంపస్ సీఈవో నిఖిల్ అగర్వాల్ కృతజ్ఞతలు తెలిపారు.






