ఉమ్మడి వరంగల్‌లో ఈదురు గాలులు, వాన బీభత్సం
- కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షార్పణం
- ఎగిరిపోయిన పంట కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు
మహబూబాబాద్/ జనగామ, మే 6 (విజయక్రాంతి): ఆరుకాలం కష్టపడి పండిం చిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నిరీక్షిస్తున్న రైతులను అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగా మ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్ర యానికి తెచ్చిన ధాన్యం చాలాచోట్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో రాశులుగా పోసి, వర్షానికి తడవకుండా టార్పాలిన్ కప్పుకున్నప్పటికీ, గాలి దుమారానికి కొట్టుకుపోయా యి. అనంతరం కురిసిన వర్షానికి ధాన్యం రాశులు నీటిపాలయ్యాయి.
రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్న రైతులకు అకాలవర్షాలు శాపంగా మారా యి. కొనుగోలు కేంద్రంలో జాప్యం వల్ల తమకు నష్టం కలిగిందని, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులకు కోరుతున్నారు. మంగళవారం రాత్రి మలహ ర్రావులో, మహాదేవపూర్‌లో, మహాముత్తారంలో, ఘనపూర్‌లో, భూపాలపల్లిలో ములుగు జిల్లా సన్నాయిగూడెంలో, గోవిందరావుపేటలో తాడువాయిలో, వాజేడులో వర్షం కురిసింది.






