24 June, 2026 | 6:11 PM

గ్రామ సంఘాల పనితీరు మరింత మెరుగుపరచండి

24-06-2026 05:01 PM

బోథ్, జూన్ 24 (విజయక్రాంతి): గ్రామ సంఘాల పనితీరును మరింత మెరుగుపరచాలని మహిళా సమాఖ్య ఏపిఎం గణేష్ కోరారు. బుధవారం మహిళా సమాఖ్య కార్యాలయంలో వివిధ గ్రామాల వివో లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకుగాను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు అంతేగాక సీసీలు గ్రామ సమైక్య సంఘాల పనితీరు పైన దృష్టి సారించాలని గ్రామస్థాయిలో సమైక్య సంఘాల పనితీరుపై తరచుగా సమావేశాలు నిర్వహించాలన్నారు. జీవోలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని సమావేశాలలో సంక్షేమ పథకాల లబ్ధి పొందే విధంగా చూడాలన్నారు సమావేశంలో టీజీవి ఫీల్డ్ ఆఫీసర్ ప్రతాప్ వెలుగు సీసీలు పాల్గొన్నారు