పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు
02-06-2026 06:11 PM
బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలో మరో తవ్వకాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. అధికారుల కళ్ళముందే కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. కొంతమంది జెసిబి ఓనర్లు కడుగు ముందుకు వేసి అక్రమం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. అన్న విమర్శలు వస్తున్నాయి. రాత్రిపూట టిప్పర్ల తో మొరం తవ్వకాలు కొనసాగిస్తుండగా పగలు ట్రాక్టర్ల ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారుల కండ్ల ఎదుటనే జరుగుతున్న ఈ కథను చూసి చూడనట్లు ఉంటున్నారా అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తపరుస్తున్నారు.






