27 July, 2026 | 2:55 AM

దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వ ప్రాధాన్యం

27-07-2026 02:03 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 26 (విజయక్రాంతి): దివ్యాంగుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. యూసుఫ్ గూడలోని మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.హ్యుందాయ్ మొబిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన యాక్సెసిబిలిటీ అండ్ ఫ్రీడమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఫౌండేషన్ సభ్యులతో కలిసి సుమారు 90 మంది దివ్యాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగులకు పవర్ వీల్ చైర్లను అందజేయడం అభినందనీయమన్నారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఫౌండేషన్ తీసుకున్న చొరవను ప్రశంసిం చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగుల సంక్షేమానికి, వారి సాధికారతకు కట్టుబడి ఉందని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త చిన్న శ్రీశైలం యాదవ్, జాతీయ దివ్యాంగుల హక్కుల సంఘం అధ్యక్షుడు తుడుం రాజేందర్, దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షఫీ అహ్మద్ ఖాన్,ప్రభంజన,ఫౌండేషన్ సీఎస్‌ఆర్ ప్రతినిధి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.