పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాటూర్, మాసానిపల్లి, వదల్పర్తి గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో పిసిసి కేంద్రాలను డిసిఎస్ఓ.వెంకటేశ్వర్లు మరియు డిఎం.శ్రీకాంత్ కలిసి సందర్శించి పరిశీలించారు. పీసీసీ కేంద్రాలలో వడ్ల కాంట చేయడంలో ఆలస్యాలపై, సమస్యలపై రైతులను ఆరాధిస్తారు. జూన్ మాసం వచ్చిందని రైతులెవరు ఆచార్య పడవద్దని పూర్తిస్థాయిలో మరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని లేనిపోని అపోహలకు గురికావద్దని రైతులకు ధైర్యం నింపారు. మాసంపల్లి పిసిసి సెంటర్ విజయవంతంగా క్లోజ్ చేయడం జరిగిందన్నారు. మండలంలోని మిగతా పీసీసీ సెంటర్లను కూడా పూర్తిస్థాయిలో క్లోజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.మాసంపల్లి పీసీసీ సెంటర్ క్లోజ్ చేయడానికి సహకరించిన జిల్లా అధికారులకు నాగిరెడ్డిపేట్ మండల ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.






