27 July, 2026 | 3:00 AM

నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గం

27-07-2026 02:05 AM

పంజాగుట్ట, జూలై 26 (విజయక్రాంతి): నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.నిమ్స్ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నూతన పదాధికారులను సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ మార్త రమేశ్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజ్ కుమార్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసులు,సలహాదారులుగా సత్యగౌడ్, శాంతికుమారి, ఉపాధ్యక్షులుగా వై.రాధిక, కె.శ్రీనివాస రావు, నాగరాజు,సంయుక్త కార్యదర్శులుగా ఎఫ్.వీణ, ఎం.వేణుగోపాల్,రాజశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.ఎ.సలీం ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో హౌసింగ్ సొసైటీ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తామన్నారు. సొసైటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రెండు సంవత్సరాల పదవీకాలంలో సమర్థవంతంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సమావేశంలో పాల్గొన్న సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. సొసైటీ అభివృద్ధికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ అధ్యక్షురాలు ఆశలత, కార్యదర్శులు సౌజన్య, రమాదేవి, పారామెడికల్ యూనియన్ అధ్యక్షురాలు శాంతికుమారి, కార్యదర్శి మహేశ్ బాబు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శరత్ బాబు, కోశాధికారి రామరాజు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కేజియా రాణి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.