మోడల్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలకు 20 కోట్లు మంజూరు
- అభివృద్ధిలో మరో మైలురాయి
హుజూర్ నగర్: పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్ రూమ్ మోడల్ హౌసింగ్ కాలనీలో పాఠశాల భవనంతో పాటు, కమ్యూనిటీ హల్,అంగన్ వాడి భవనం,షాపింగ్ కాంప్లెక్స్ ఇతర మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఉత్తర్వులను వారు విడుదల చేశారు. దీంతో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెనువెంటనే ప్రభుత్వం అధిక నిధులను విడుదల చేయడంతోపాటు గత 14 సంవత్సరముల పట్టణ పేద ప్రజల కలను నెరవేర్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేశారు.




