8 June, 2026 | 3:49 AM

వీరభద్రీయుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం

08-06-2026 12:59 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్చెరు, జూన్ 7 : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వీరభద్రీయుల సంక్షేమా నికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ అన్నారు. ఇస్నాపూర్ వీరభద్రియుల  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముత్తంగి డివిజన్ పరిధిలో గల భవన నిర్మాణ స్థలంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ..అన్ని వర్గాల సం క్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

ఇస్నాపూర్ వీరభద్రియుల సంక్షేమం కోసం ఇప్పటికే సొంత ని ధులతో 200 గజాల స్థలం అందించడం జ రిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నూ అండగా ఉంటానని భరోసా అందించా రు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పం చ్ ఉపేందర్, మాజీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, కుమార్ గౌడ్, ప్రభాకర్, మేరాజ్ ఖాన్, సందీప్, రామకృష్ణ, సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, పటాన్చెరు అధ్యక్షులు చవ్వ కొండల్, తదితరులు పాల్గొన్నారు.