లయన్స్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం
నేరేడుచర్ల,ఆగస్టు 2 :లయన్స్ క్లబ్ నేరేడుచర్ల అధ్యక్షులు షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చార్టర్ ప్రెసిడెంట్ కొణతం సీతారామరెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ,స్నేహితుల దినోత్సవం స్నేహబంధా లను మరింత బలోపేతం చేసుకోవడం, పరస్పర ప్రేమాభిమానాలు, నమ్మకం, సహకా రం మరియు ఐక్యతను పెంపొందించుకుం టూ లయన్స్ క్లబ్ సేవలను మరింత బలోపేతం చేయాలని కోరారు. క్లబ్ అడ్వైజరీ ఆనరబుల్ చైర్పర్సన్గా రాచకొండ విజయలక్ష్మి ఎన్నికైన సందర్భంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలోక్లబ్ ప్రధాన కార్యదర్శి సరికోప్పుల నాగేశ్వరరావు, కోశాధికారి సైదులు నాయక్, ఉపాధ్యక్షులు, గుండా సత్యనారాయణ మూలగుండ్ల వెంకటరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేరేడుచర్ల వాసవి క్లబ్ అధ్యక్షుడు నీలా రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమ0లో మాజీ డిస్టిక్ చైర్పర్సన్ కందిబండ శ్రీనివాసరావు ,మాజీ అధ్యక్షులు ఊట్కూరు నటరాజ్ మాజీ సెక్రటరీ ఉప్పల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






