తాజాగా కుళ్లిన మాంసం
మంగళ్‌హాట్‌లో విక్రయిస్తున్న ముఠా
నిందితుడు అఫ్రోజ్ అరెస్ట్
300 కేజీల మాంసం వ్యర్థాల స్వాధీనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 11 (విజయక్రాంతి): కుళ్లిన మాంసాన్ని తాజా మాంసమని నమ్మించి విక్రయిస్తున్న ముఠా గుట్టును మంగళ్‌హాట్ పోలీసులు రట్టు చేశారు. మంగళ్‌హాట్ పోలీసులతో కలిసి గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో సుమారు 300 కిలోల కుళ్లిన మాంసం వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
దందాకు సూత్రధారి అయిన మహమ్మద్ అఫ్రోజ్‌ను అరెస్టు చేశారు. మంగళ్‌హాట్‌లోని చిస్తీ చమన్ దర్గా సమీపంలో ఉన్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. అమర్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అఫ్రోజ్ అఫ్రోజ్ (41) ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. నిందితుడు అధిక లాభాల కోసం కర్ణాటక, ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే మాంసం వ్యర్థాలను సేకరించేవాడు. సేకరించిన మాం సాన్ని రోజుల తరబడి డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉండిపోయిన మురుగు నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో భద్రపరిచేవాడు.
మాంసం కుళ్ళిపోయి దుర్వాసన రాకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు వాడుతూ, విని యోగదారులకు అది అప్పుడే కోసిన తాజా మాంసమని నమ్మించి విక్రయిస్తున్నాడు. నిం దితుడు అఫ్రోజ్ గతంలో కూడా ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడ్డాడు. అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు అతడికి భారీగా జరిమానా విధించిన ప్పటికీ, తన ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 300 కేజీల మాంసాన్ని జీహెచ్‌ఎంసీ అధికారుల సమక్షంలో క్షేమంగా పారవేశారు.




