12 March, 2026 | 9:58 AM

అభివృద్ధిలో అగ్రభాగాన బోయినపల్లి మండలం

12-03-2026 12:57 AM
  1. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినపల్లి: మార్చి 11(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో అగ్ర భాగాన నిల్పనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. బుధవారం బోయినపల్లి మండల కేంద్రంలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంఘాల భవనాల నిర్మాణాలకు భూములు చేసి, బూరుగుపల్లి లో సిసి రధర నిర్మాణంకు పనులు ప్రారంభించి, స్థలం పెళ్లి వద్ద పూర్తికావస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణం పనులను పరిశీలించి, కోదురుపాకలో వికలాంగునికి స్కూటీ అందించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు సమిష్టిగా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. బోయినపల్లి మండలంలో మిగిలిపోయిన సమస్యలను వెంటనే దశల వారిగా పరిష్కారం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  భీమా జయ శీల, తాసిల్దార్ నారాయణరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, కరీంనగర్  నగరపాలక సంస్థ కౌన్సిలర్ వరాల నరసింగం,ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్ ఎస్ యాదవ్, వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, డైరెక్టర్లు బాలగోని వెంకటేష్, అజయ్, సర్పంచులు నల్లమోహన్, ఏనుగుల కనకయ్య, భీమ్ రెడ్డి మహేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీరాజం, తదితరులు ఉన్నారు.