12 March, 2026 | 4:22 AM

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించండి

12-03-2026 12:59 AM

ముకరంపుర, మార్చి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని ,ఇంటిగ్రే టెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బుధవారం భారతీయ మజ్దూర్ సంఘ్  నాయకులు  నగర మేయర్ కోలగా ని శ్రీనివాస్ ను కలసి వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడు తూ  నగరంలో వీధి వ్యాపారులు తీవ్ర ఇ బ్బందులు ఎదురుకుంటున్నారని, ప్రధాన రహదారులు,

మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, చిరు సా మాగ్రిని విక్రాయిస్తు  జీవనోపాధిని పొందుతున్నామని తరచూ మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు తమ సామాగ్రిని జప్తు చే స్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పసుల శ్రవణ్, జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, స్ట్రీట్ వెండార్స్ నాయకులు ఆకుల తిరుపతి, నక్క అరుణ్, రమణయ్య, శ్రీనివాస్, మంజూల, తదితరులు పాల్గొన్నారు.