ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్
క్వాలిటీ థాట్, అన్‌అకాడమీ సెంటర్ సంయుక్తంగా నిర్వహణ
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): క్వాలిటీ థాట్, అన్‌అకాడమీ సెంటర్ మాదాపూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘క్యూటీ యూఎన్‌ఏ నీట్ మిషన్ 100’ ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం మాదాపూర్‌లోని అన్‌అకాడమీ సెంటర్లో ప్రారంభించారు.
క్వాలిటీ థాట్ వ్యవస్థాపకుడు, అన్‌అకాడమీ సెంటర్ ఫ్రాంచైజీ భాగస్వామి రమణ భూపతి కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఐకోన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరి, జనరల్ సర్జరీ విభాగాధిపతి డా. వెంకట్ పవన్, అనస్థీషియా విభాగాధిపతి డా. వేణుగోపాల్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డా. రాజశేఖర్ మడాల, ఏయిమ్స్ ట్రామా సర్జన్ డా. దామోదర్‌కా కుమాను పాల్గొన్నారు. జూలై 1 నుంచి 14 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 150 మంది రెసిడెన్షియల్ విద్యార్థులకు ఉచిత కోచింగ్, వసతి, భోజనం, అలాగే 500 మంది డే స్కాలర్లకు ఉచిత తరగతులు అందిస్తామని రమణ భూపతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 9160934149ను సంప్రదించాలని సూచించారు.






