కనుల పండువగా హనుమాన్ శోభాయాత్ర
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఉత్తరవాహిని నదీతీరంలో వెలసిన కేస్లాపూర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నుండి నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కన్నుల పండువగా సాగింది. హనుమాన్ ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకులు వొజ్జుల శిరీష్ శర్మ, వారణాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్రను ప్రారంభించారు.
కేస్లాపూర్ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో భక్తుల నృత్యాల మధ్య పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరం, పొట్టి శ్రీరాములు చౌక్, గాంధీచౌక్, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్ మార్గంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఎస్హెచ్‌ఓ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సైలు కోమరయ్య, కమలాకర్ సహా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండ వెంక న్న, కోశాధికారి పిన్న వివేక్, ఏకీరాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి చిలుకూరి రాధా కృష్ణ చారి, డాక్టర్ మధు, తుజులపురం మురళీధర్ గౌడ్, ఏఎంసీ ఛైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేష్, బురుగూడ సర్పంచ్ మెకార్తి సంగీత లక్ష్మణ్, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, రాపర్తి కార్తిక్, కుర్సెంగ బాలకృష్ణ, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.




