26 April, 2026 | 5:19 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదన్నదే ఎమ్మెల్యే లక్ష్యం

24-02-2026 06:47 PM

- జమస్తాన్‌పల్లిలో ఉచిత కండ్ల అద్దాల పంపిణీ

మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదన్నదే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యమని సీనియర్ జర్నలిస్ట్ జాజుల స్వామి గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జమస్తాన్‌పల్లి గ్రామంలో ఎమ్మెల్యే తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా కండ్ల అద్దాలను పంపిణీ చేసి మాట్లాడారు.

నిరుపేదలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేకు మండల, గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులకు ప్రత్యేకంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. లబ్ధిదారులు కండ్ల అద్దాలను అందుకుని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందుగుల నరసమ్మ–యాదయ్య, వార్డు సభ్యులు జాజుల నాగమ్మ–శంకరయ్య, పంతంగి నరసింహ, మేడి మౌనిక–నరేందర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముంత యాదగిరి, ఆశా వర్కర్ నకిరకంటి లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ పగిళ్ల సైదులు, సీనియర్ జర్నలిస్ట్ జాజుల స్వామి గౌడ్ తదితరులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.