26 April, 2026 | 7:00 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నూతన రథోత్సవానికి ఘన శ్రీకారం

24-02-2026 06:41 PM

- అంతంపేట సోమేశ్వరాలయ జాతరలో భక్తుల సందడి

మునుగోడు(గట్టుప్పల్),(విజయక్రాంతి): సోమరాజుగూడ అంతంపేట గ్రామంలోని సోమేశ్వరాలయ వార్షిక జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతరలో మూడవ రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం నూతనంగా తయారు చేసిన రథాన్ని ఇందుర్తి వాస్తవ్యులు కుంభం సత్యనారాయణ రెడ్డి ప్రారంభించి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, గట్టుప్పల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నామిని జగన్నాథం, ఎస్సై సంజీవరెడ్డి, శ్రీశైలం గౌడ్, రాచమల్ల వెంకటరెడ్డి, దేవస్థానం చైర్మన్ మాడుగుల నవీన్, పూసపాటి శంకరప్ప, ఓసి రెడ్డి రామిరెడ్డి, సిరప్ శేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని సందడి నెలకొంది.