పెద్దపల్లి వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
24-02-2026 07:09 PM
మధ్యాహ్నం నుంచి కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు
యూరియా కోసం కార్యాలయానికి వచ్చిన రైతులు కార్యాలయం ముందు పడిగాపులు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం కార్యాలయంలోకి వచ్చిన అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో యూరియా కోసం కార్యాలయానికి వచ్చిన రైతులు కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్కసారిగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తుండడంతో సోదాలో ఏమైనా అవినీతి బయటపడుతుందోనని రైతులు ప్రజలు ఎదురుచూస్తున్నారు.




