ఉచితంగా హెల్మెట్‌ల పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ అర్బన్ ఆగస్టు 30(విజయక్రాం తి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ స మీపంలోని మెయిన్ రోడ్డు సత్వ హోటల్ ద గ్గర తేజ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉ చితంగా హెల్మెంట్ ల పంపిణీ కార్యక్రమం లో మేడ్చల్ ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యు లు చామకూర మల్లారెడ్డి పాల్గొని పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేజ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్య క్రమంలో భాగంగా హెల్మెంట్ లు లేనివారికి ఉచితంగా హెల్మెంట్ లు అందించాలనే ఉద్దేశంతో సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకొని ఉద్యోగాలు పొందిన మా విద్యార్థులు ఇంత మంచి పనులు చేయడం నాకు సంతోషాన్ని కలిగించిందని మల్లారెడ్డి కొనియాడారు.
సమాజంలో బైక్ లు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్‌లు ధరించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో తేజ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, మాజి సర్పంలు శ్రీనివాస్ రెడ్డి, గణేష్ నేత, మాజీ కౌన్సిలర్‌లు బాలరాజు, అమరం హేమంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాద వ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల మాజి అధ్యక్షులు దయానంద్ యాదవ్, విష్ణుషారి, ర వీందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






