31 August, 2026 | 4:50 AM

రాజ్యాంగం వల్లే బహుజనుల ఎదుగుదల

31-08-2026 12:44 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాజ్యాంగం వల్లే బహుజనులు సామాజికంగా, ఆర్ధికంగా రాజకీయంగా ఎదగడం జరుగుతుందని యంనంపేట్ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షులు పోలగోని సహదేవ్ గౌడ్ అన్నారు.  ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడానికి 281వవారం నిత్య పూలమాల కార్యక్ర మం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా పోలగోని సహదేవ్ గౌడ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా సహదేవ్ డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ భారత రాజ్యాంగం రూపొందించటం వల్లే  నేడు బహుజనులు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలకు పోటీ పడే విధంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. అంబెడ్కర్ బడుగు బ లహీన అట్టడుగు వర్గాల జాతిపిత అని కీర్తించారు.

నిత్యపూలమాల కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్న అరుణ్ కుమా ర్ కి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, కె. నర్సింగ్ రావు, రేగు సత్యనారాయణ, ఎన్. వెంకట్ రెడ్డి, మీసాల రాజేష్ కుమార్, కడప రవి, అంజయ్య, కడప నిఖిల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.