జింక మాంసం తరలిస్తున్న నలుగురు అరెస్ట్
08-04-2026 02:02 AM
కొల్లాపూర్ మండలం చింతలపల్లిలో ఘటన
నాగర్ కర్నూల్/కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో అటవీశాఖ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.




