29 July, 2026 | 2:49 AM

ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

29-07-2026 12:00 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్- 

అమ్రాబాద్‌లో రూ.12.70 కోట్ల పనులకు శంకుస్థాపన

అచ్చంపేట, జూలై 28: నల్లమల గిరిజనులు, ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం అమ్రాబాద్ మండలం మన్ననూరులో ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణతో కలిసి రూ.12.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెంచు గిరిజనుల స్వయం ఉపాధి కోసం రూ.1.80 కోట్లతో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.

గురుకులాల్లో ఉపాధ్యాయుల ఖాళీలను త్వరగా భర్తీ చేసి, నాణ్యమైన విద్య, డిజిటల్ లెర్నింగ్, మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే వంశీ కృష్ణ పేర్కొన్నారు. అనంతరం మద్దిమడుగు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఈఓ రమేష్ కుమార్, ఆర్డీవో యాదగిరి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.