28 May, 2026 | 2:48 AM

అభివృద్ధి పనుల్లో నాణ్యత ముఖ్యం

28-05-2026 01:30 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రూ.11.65 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

బడంగ్పేట్, మే 27 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో రూ.11.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న 110 మీటర్ల నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో నాణ్యతా ప్ర మాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ హరిని, ఏఈ సౌమ్య, వ ర్క్ ఇన్స్పెక్టర్తో పాటు స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.