ఆదర్శనగర్‌లో సీసీ డ్రైన్ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన
12-08-2026 02:34 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్ ఆదర్శనగర్‌లో రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పైప్‌లైన్ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం నగర పాలక సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ , మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు, స్థానిక నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






