నేనే గెలుస్తా..
రాబోయే ఎన్నికల్లో నాదే గెలుపు
పార్టీని నమ్మిన సర్పంచ్ లకు, కార్యకర్తలకు అండగా ఉంటా..
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కూసుమంచి, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని, పాలేరులో నేనే గెలుస్తానని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూసుమంచి మండల బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పాలేరు గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేసి, నేనే మీ ఎమ్మెల్యేగా గెలుస్తానని జోస్యం చెప్పారు.
రానున్న రోజులు మనవే... కాబోయే సీఎం కేసీఆర్, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తాత్కాలికమేనని అన్నారు. రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు బనాయించినా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తల సంక్షేమం కోసం, వారి భద్రత కోసం నేను ఎల్లప్పుడూ ముందుంటానని, మీకు ఏ కష్టం వచ్చినా కొండంత అండగా నేను ఉంటానని అన్నారు. కార్యకర్తలు ఆదైర్యపడోద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.






