29 March, 2026 | 3:39 AM

నేపాల్ మాజీ ప్రధాని ఓలి అరెస్ట్

29-03-2026 01:51 AM
  1. మాజీ హోంమంత్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రతీకార చర్య కాదు, న్యాయ ప్రక్రియకు ఆరంభం

దేశం కొత్త దిశను అనుసరిచేందుకు సిద్ధం

హోం శాఖ మంత్రి సుడాన్ గురంగ్

ఖాట్మాండు, మార్చి 28: జెన్ జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేసి అనేక మంది మృతికి  కారణమయ్యారనే ఆరోపణలపై నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని అరెస్టు చేశారు. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణం చేసిన మరుసటి రోజు శనివా రం ఉదయం మాజీ ప్రధానిని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ హోంమంత్రి రమేశ్ లేఖక్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కేపీ శర్మ ఓలి అరెస్టును కొత్త హోం వ్యవహారాల శాఖ మంత్రి సుడాన్ గురంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ఇది ప్రతీకార చర్య కాదన్నారు. న్యాయ ప్రక్రియకు ఆరంభంగా అభివర్ణించారు. ఇప్పు డు దేశం కొత్త దిశను అనుసరిస్తుందని ఆయ న విశ్వాసం వ్యక్తంచేశారు. కాగా తన అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానని మాజీ ప్రధాని మీడియాతో అన్నారు. ముమ్మాటికీ ఇది కక్షపూరిత చర్యే అని ఆరోపించారు. జెన్ జీ ఉద్య మంపై దర్యాప్తు జరిపి ఉన్నతస్థాయి కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని గతంలో నిర్ణయించారు.

ఆందోళనకారులపై కాల్పులు జరపాలని ఆదేశాలు ఉన్నట్లు రుజు వు కాలేదని కమిషన్ తన నివేదికలో పేర్కొం ది. కాల్పులను ఆపేందుకు కూడా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే అనేకమంది మైనర్లు ప్రాణాలు కోల్పోయారని స్పష్టంచేసింది. కమిషన్ సిఫార్సు ఆధారంగా దోషులుగా తేలితే పదేళ్ల వరకు  శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.