26 April, 2026 | 6:31 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ

26-04-2026 04:56 PM

కందాళ ఉపేందర్ రెడ్డి ఘనంగా సత్కరించిన స్వామి ఆలయ కమిటీ

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం, లింగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి, బొడ్రాయి, గరుడ స్తంభ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం హాజరై ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ యువజన నాయకులు వాడిత్య బాలకృష్ణ వారిని ఘనంగా సత్కరించింది. శాలువా కప్పి సన్మానించారు. ఆలయ నిర్మాణానికి,  అన్నదాన కార్యక్రమాలకు వారు అందించిన ఆర్థిక సహకారం అభినందనీయం కమిటీ కొనియాడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరిని చల్లగా చూడాలని, అందరు బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు పుష్ప రవి, గ్రామస్థులు బాలకృష్ణ, వెంకటేష్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.