ఎవరి హస్తం?
- ఆ ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఎవరు?
- ఓ యూట్యూబ్ ఛానల్ న్యూస్‌పై సర్వత్రా చర్చ..
- శ్రీనివాస్ గౌడ్ పాలమూరుకు గుడ్‌బై అంటూ ప్రచారం..
- మాజీ మంత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే అంటూ బీఆర్‌ఎస్ నేతల ఫైర్..
- టూ టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు
- నా ప్రాణం....శ్వాస పాలమూరే..
- సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నందుకే దుష్ప్రచారం
- పాలమూర్ కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చా: ‘విజయక్రాంతి’తో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, జూలై 12 (విజయక్రాంతి): ఉద్యోగం వదిలి ఉద్యమంలోకి... ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ సంఘం నేతగా ఉద్యమంలో తన పాత్ర చురుగ్గా పోషిస్తున్న తనకు ఎక్కడో వెలితి కనిపించి, లక్షల రూపాయల ఉద్యోగాన్ని సైతం గడ్డి పోచల తిరస్కరించి ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ముందుకు సాగిన నేతగా శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకం చేసి స్వారాష్టం పోరులో ముందుండి నడపడంలో శ్రీనివాస్ గౌడ్ ది ప్రత్యేక స్థానం. తన చురుకుదనం నాయకత్వాన్ని గుర్తించిన బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ మహబూబ్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధించాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి దిగ్విజయం సాధించిండ్రు.
అప్పటికే వలసలు కరువు తాగునీరు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్న పాలమూరుకు ఒక ఆశ జ్యోతిగా నిలుస్తు 2018లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి పదవి పొందిన తర్వాత మహబూబ్ నగర్ అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా తీసుకొచ్చారు. మహబూబ్ నగర్ కు బైపాస్ రోడ్డు శిల్పారామం వేయి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన కలెక్టరేట్ భవనం, అన్ని వర్గాలకు ప్రత్యేక ప్రార్థన మందిరాలు ఆలయాల అభివృద్ధి, వ్యవసాయ రైతు మార్కెట్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పాలమూరు రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్‌ఎస్ కు దక్కుతుందని ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా చెప్పుకుంటుండ్రు.
నా ప్రాణం.. శ్వాస పాలమూరే..
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలలో పాలమూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతం నలుమూలాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజల సైతం నగరంలో జీవనం కొనసాగిస్తుండడంతో నగరానికి మరింత ప్రాముఖ్యత చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లా రాజకీయం అంత ఇ టు వైపు చూడని రాజకీయ నేతలు, ప్రజలు ఉండరు. స్వరాష్ట్ర సాధనలో నేను సైతం అంటూ టీజీవోను ఆవిష్కృతం చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్రం సిద్ధిం చిన తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రి గా శ్రీనివా స్ గౌడ్ ప్రజలకు సేవలు అందించిన విష యం విధితమే. మాజీ మంత్రి భవిష్యత్తు రా జకీయంపై జరుగుతున్న రగడ పాలమూరు నగరంలో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.
ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా పాలమూరును మాజీ మంత్రి వీడుతున్నారా? అంటు బీఆర్‌ఎస్ తో పాటు ఆటో అధికార పక్ష నేతలు, ప్రజలు చర్చించుకునేలా సోషల్ మీడియా వేదిక అయింది. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీ సుకోవాల ని బీఆర్‌ఎస్ బలంగా కోరుకుంటుంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీఆర్ఎస్ నేతలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ అప్పయ్యకు తప్పుడు ప్రచారం చేస్తుందని ఓ యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ప్రమేయం లేకుండా సంప్రదింపులు జరపకుండా ఇతర ప్రాంతాలలో వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారని చె ప్పడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వారు గట్టిగా చెబుతున్నారు.
ప్రజలకు మంచి చేయడం మానేసి ఇలాంటి తప్పుడు ప్ర చారాలకు శ్రీకారం చుట్టడం విడ్డూరంగా ఉందని పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చే స్తున్నారు. మాజీ మంత్రి చివ రి శ్వాస వరకు పాలమూరు నుంచి బరిలో ఉంటారని ప్రతి రోజు ప్రతి సమస్యపై పోరాటం చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. తప్పుడు ప్రచారానికి ముగింపు పలక పోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు పేర్కొంటుండ్రు. నా ప్రాణం.... శ్వాస పాలమూరే ఆ నేత పేర్కొన్నారు.
నా ప్రాంత గోస తీరినప్పుడే.. నా లక్ష్యం నెరవేరినట్టు
ప్రాణాలను లెక్కచేయకుండా స్వరా ష్ట్ర సాధన లక్ష్యమని ఉద్యమ నాయకు డితో కలిసి అలుపు ఎరగని పోరాటం చే సిన. ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు పాలమూరు అభివృద్ధి నా లక్ష్యం. అ ధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజల కు చేసిన మంచే శాశ్వతంగా ఉంటుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని 100% స ద్వినియోగం చేసుకొని రాత్రి పగలు శ్ర మించి పట్టణాన్ని నగరంగా రూపకల్ప న కావడంలో తమ శ్రమ ఎంతో ఉంది. ఎవరో కొందరు పాలమూరుని విడిచి పెట్టి పోతున్నారని ప్రచారం చేయడం దారుణం.
తప్పుడు ప్రచారం చేసి కాలం వెళ్ళా తీసుకోవడం అనుకోవడం మూర్ఖ త్వం. ఎన్నో అవకాశాలు గతంలో ఉన్నప్పటికీ నేను పుట్టిన గడ్డ అభివృద్ధి చేసు కుంటేనే నా జన్మ సార్థకం అవుతుందని గట్టిగా నమ్మిన కాబట్టే ఇక్కడి నుంచి రా జకీయ ప్రవేశం చేశాను. నా సొంత లబ్దికోసం ఏనాడు పనిచేయలేదు. నగరంలో ఎన్నో పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని పదేపదే కోరుతున్న. అయినప్పటికీ ఆచరణలో అడుగులు ముందుకు పడట్లేదు. ఇలాం టి దుష్ప్రచారాలు చేయడంతో ప్రజలు ఎవరు నమ్మరు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు చదువు దూరంగా ఉన్నవారికి ఉపాధి కల్పించి అందరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా చేయడమే నా అంతిమ లక్ష్యం, నా ఊపిరి ఉన్నంతవరకు పాలమూరు నియోజకవర్గం నుంచి మాత్రమే ఎన్నికల్లో బరిలో ఉంటాను. ఇందులో ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారం చేసిన ప్రజలు నమ్మరు.
మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్






