28 April, 2026 | 6:53 PM

బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం

28-04-2026 04:42 PM

వైష్ణవీదేవి ప్రసాదం అందజేసిన మాజీ జడ్పీటీసీ ఉమ్మన్న మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ ప్రాంతంలోని నివాసంలో భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్న మనోహర్ రెడ్డి  ప్రత్యేకంగా పాల్గొని జీవన్ రెడ్డిను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర క్షేత్రం వైష్ణవీదేవి దేవస్థానం నుండి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి జీవన్ రెడ్డి  చేస్తున్న కృషి అభినందనీయని ఉమ్మన్నమనోహర్ రెడ్డి పేర్కొన్నారు. జీవన్ రెడ్డి  కూడా స్పందిస్తూ, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రజాసేవలో ముందుకు సాగుతానని తెలిపారు. ఇటువంటి సన్మానాలు మరింత బాధ్యతను పెంచుతాయనన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.