28 April, 2026 | 6:50 PM

నిలిచిపోయిన నీటి దారులు

28-04-2026 04:39 PM

కళా విహీనంగా మారిన జలపాతం

మండలంలోని పోచ్చర జలపాతం మీరు లేక కళావిహీనంగా మారిన దృశ్యం

బోథ్,(విజయక్రాంతి): వర్షాకాలంలో గలగల పారే వాగు ఎండిపోవడంతో పోచ్చెర జలపాతం నీరు లేక కళావిహీనంగా మారింది. వర్షాకాలం పర్యాటకులను ఆకట్టుకునే ఈ జలపాతం అందాలను చూసేందుకు ఇతర జిల్లాల నుండి పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. అయితే ఈ జలపాతానికి వచ్చే పెద్ద వాగు పూర్తిగా ఎండిపోవడంతో నీటి దారాలు నిలిచిపోయాయి. ఫలితంగా జలపాతం అందాలు కనుమరుగయ్యాయి. బోసిపోయిన జలపాకాన్ని చూసేందుకు ఎవరు రాకపోవడంతో జనం లేక జలపాతం వేల వేల పోతున్నది. నీటిని నిలువ చేసేందుకు చెక్ డ్యాములు వాగుపై నిర్మించిన ఫలితం లేకుండా పోయింది.