31 March, 2026 | 4:55 AM

బ్రెయిన్, స్ట్రోక్‌తో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మృతి

31-03-2026 12:00 AM

నేడు పోతారంలో అంత్యక్రియలు 

కామారెడ్డి, మార్చి 30 (విజయక్రాంతి): తాజా మాజీ కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గ్యార లక్ష్మి సోమవారం ఉదయం 10 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో లక్ష్మిని హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 10 గంటలకు ఆమె ఆసుపత్రిలో మరణించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కూతురు గ్యార అఖిల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందారు. గతంలో గ్యార లక్ష్మి మాచారెడ్డి మండల జడ్పిటిసి గా పని చేశారు.

అనంతరం కామారెడ్డిలోని అశోక్ నగర్ లో కుటుంబంతో కలిసి స్థిరపడ్డారు. తాజా మాజీగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఆమె భర్త గ్యార సాయిలు గ్రామ సర్పంచ్ గా పోతారంలో పనిచేశారు. లక్ష్మీ అంత్యక్రియలు మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పోతారంలో నిర్వహించనున్నారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడే లక్ష్మి మృతి చెందడం రాజకీయ వర్గాల్లో, కుటుంబ సభ్యులు బంధువుల విషాదాన్ని నింపింది. బ్రెయిన్ స్ట్రోక్ తోనే లక్ష్మీ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.