22 August, 2026 | 6:59 PM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

22-08-2026 05:50 PM

మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిజాంపేట్ సర్కిల్ 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ రోడ్డు నెంబర్ 11లో నూతనంగా ఏర్పాటు చేసిన రామారావు ఆసుపత్రిని 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగం రాజు మాట్లాడుతూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ,దినదినాభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జల్లూరి రమణ, సాయిలు, శేఖర్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.