2 June, 2026 | 10:41 PM

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

02-06-2026 08:07 PM

కోదాడ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అమరవీరుల త్యాగాల ఫలంగా, సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ సాకారమైందని ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ, నాయకులు వెంకటరత్నం బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, చింతలపాటి శ్రీనివాసరావుతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.