13 July, 2026 | 4:31 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

05-02-2026 12:11 AM

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఉరివేసుకుని వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్,వయసు (35) సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి, చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి, ఎస్‌ఐ మహేష్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మృతునికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్త్స్ర మహేష్ తెలిపారు. మృతుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లారెడ్డి కి తరలించినట్లు ఎస్త్స్ర తెలిపారు.