17 March, 2026 | 9:15 PM

భారే గూడెంలో గాలికుంటు వ్యాధి టీకాలు ప్రారంభం

17-03-2026 07:22 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు మండలం బారెగూడెం గ్రామంలో బెజ్జూరు పశువైద్యాధికారి రాకేష్ ఆధ్వర్యంలో భారగూడెం సర్పంచి తేలి సుశీల మంగళవారం గాలి కుంటు టీకాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు గాలికుంటు వ్యాధి టీకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, రైతులు పశువులకు టీకాలు  వేయించి పశువులను కాపాడుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జూర్ పశువైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ కుడిమత జితేందర్, గోపాలమిత్ర మనోహర్, నాయకులు తేలి బాపు రైతులు పాల్గొన్నారు.