11 May, 2026 | 9:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్‌లో ఫుడ్ ఫెస్ట్

30-11-2025 12:00 AM

పాల్గొన్న విద్యార్థులు

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్‌కాలనీ స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో విద్యార్ధులచే ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్య అతిథిగా డాక్టర్ కొండా అన్విత పాల్గొని ఫుడ్ ఫెస్ట్‌ను ప్రారంభించారు. పాఠశాల డైరెక్ట్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే ఆరోగ్యంపై శ్రద్ధ కలిగి ఉండాలని మంచి ఆహారం తీసుకుని శారీరకంగా, మానసికంగా, ధృ ఢంగా ఉండాలని జంక్ ఫుడ్స్ దూరం చేస్తూ మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, నట్స్, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలన్నారు.

డా. కొండా అన్విత మాట్లా డుతూ.. ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అధిక పోషకాలు కలిగిన ఆహా రం తీసుకోవటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉండటమే కాకుండా మంచి శారీరక నిర్మాణం, పెరుగుదల ఉంటాయి’ అన్నారు. విద్యార్థుల ఫుడ్ స్టాల్స్లోని ఆహార పదార్థాలను వీక్షించి వారికున్న అవగాహనను అభినందించారు.

పాఠ శాల డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడు తూ.. ఫుడ్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు భారతీయ ఆహార సం స్కృతి తెలియడమే కాకుండా మంచి ఆహారంపై శ్రద్ధ పెట్టేలా చేస్తుందని తెలియజేస్తూ అందరిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.వి.ఆర్.మురళీమోహన్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.