8 April, 2026 | 4:58 AM

ప్రజాబాటలో విద్యుత్ సమస్యలపై దృష్టి : లక్ష్మీపూర్‌లో అధికారుల హామీ

08-04-2026 01:01 AM

తంగళ్ళపల్లి, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) :తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. సిరిసిల్ల డివిజన్ ఇంజనీర్ ఎన్ అంజయ్య మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామంలో ఉన్న ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లు, లూజ్ లైన్స్, వంగిన విద్యుత్ స్థంభాలు వంటి సమస్యలను గుర్తించి వాటిని సరిచేయడానికి పనులు ప్రారంభించామని చెప్పారు.

అలాగే లో వోల్టేజ్ సమస్యల నివారణకు అవసరమైన చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా రైతులు రెండు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పక్కకు మార్చాలని అధికారులకు విన్నవించారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో సర్పంచ్ నాయిని సాయి కృష్ణ, ఉప సర్పంచ్ చీమల పరుశురాం, జోహార్ రెడ్డి, ఆరేపల్లి బాలు,విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.