4 May, 2026 | 4:34 AM

డిగ్రీఫస్ట్ ఇయర్‌కు అడ్మీషన్లు ప్రారంభం

04-05-2026 03:22 AM

కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ కలదు

మహబూబ్ నగర్ టౌన్, మే 3 : ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో 2026-27 విద్యాసం స్థరానికి ఎన్.ఈ.పి 2020లో భాగంగా వృత్తి విద్య సాధారణ విద్యను మిళితము చేయడంలో డిగ్రీ మూడేళ్ల చదువు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉపాధినిచ్చే ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

బి.కాం (ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బి.ఎస్సీ (హెల్త్ కేర్ సైన్స్) వంటి నైపుణ్య కోర్సులు ఉంటాయని, ఈ కోర్సులను ప్రవేశపెట్టడంలో గల ముఖ్య ఉద్దేశ్యము డిగ్రీ చదువుకునే సమయంలోనే పరిశ్రమ అనుభవాన్ని అందించ డంతోపాటు వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశమని, రెండు సంవత్సరాలు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మూడవ సంవత్సరం ఇండస్ట్రీలో అప్ఫ్రెండ్షిప్ చేస్తూ స్టైఫండ్ పొందవచ్చని తెలిపారు.

బి.ఎ (హిస్టరీ, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ -తెలుగు, ఇంగ్లీష్,ఉర్దూ మీడియం) బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్-ఇంగ్లీష్ మీడియం)బి.ఎస్సి లైఫ్ సైన్సెస్ లో (బోటనీ,జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ న్యూట్రిషన్-ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం) 

బిఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో....

(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ -ఇంగ్లీష్ మీడియం) ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం పద్ధతిలో గల ఈ 32 కోర్సులను అభ్యసిం చేందుకు దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలను మూడు విడతలుగా చేపట్టనున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు తొలి విడత, రెండో విడత మే 15 నుంచి 25 వరకు, మూడవ విడత 31 నుంచి జూన్ 15 వరకు ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, కళాశాల లోనే దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ కలదని, విద్యార్థినిలు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్ మెంట్ చేసుకునే సదుపాయం కలదని ప్రిన్సిపల్ తెలిపారు.