6 May, 2026 | 11:42 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

వేసవి కాలం దృష్టా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

28-02-2026 10:32 AM

గుండాల, (విజయక్రాంతి): తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(Northern Power Distribution Company of Telangana Ltd ) వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొత్తగూడెం డివిజన్ గుండాల ఆపరేషన్ సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ మామకన్నులో ప్రస్తుతం ఉన్న 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 5 ఎంవీఏ సామర్థ్యంతో కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (పీటీఆర్) ను ప్రతిష్ఠించి, 3.15 ఎంవీఏ నుండి 5 ఎంవీఏకి సామర్థ్యాన్ని పెంచుతూ విజయవంతంగా చార్జ్ చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి మహేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్య పెంపుతో వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సామర్థ్య విస్తరణ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ రంగస్వామి, వెంకటేశ్వర్లు, ఏడీఈ రాంబాబు, ఏఈ నరసింహములు, జగదీశ్ తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.