27 May, 2026 | 5:22 PM

Breaking News

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •   మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు   •  

మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు

27-05-2026 04:07 PM

కోల్‌కతా: మతపరమైన మనోభావాలను(Religious sentiments) దెబ్బతీసిన ఆరోపణలపై ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై(Mamata Banerjee) ఎఫ్‌ఐఆర్ (First Information Report) నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మే 20న న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్ సింగ్ సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. 

గత సంవత్సరం కోల్‌కతాలో జరిగిన ఒక ఈద్ సభలో సనాతన ధర్మానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) కొత్త రాజకీయ వివాదం చెలరేగింది. ఒక బహిరంగ ప్రసంగంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ “గండా ధర్మ” అనే పదాన్ని ఉపయోగించారని, ఆ వ్యాఖ్య సనాతన ధర్మ అనుచరుల నమ్మకాలను, మనోభావాలను అవమానించిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టాయని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ న్యాయవాది రింకీ చటర్జీ సింగ్ సిలిగురి సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు.