పంట పొలంలో రాజుకున్న మంటలు ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది
బోథ్,మే18,(విజయక్రాంతి) పంట వ్యర్థాలకు రైతులు నిప్పు పెడుతుండడంతో పక్కన ఉన్న పంట పొలాలకు మంటలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలకు తోడుగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మండలంలోని కుచులాపూర్ బస్టాండ్ సమీపంలోని కొట్టాల రమేష్ రెడ్డి అనే రైతుకు చెందిన భూమిలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది మండుటెండలో మంటలను ఆర్పడం జరిగింది.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ ఆర్ శివాజీ తేజు చిన్నబా పు లు పాల్గొన్నారు. సంవత్సరం పంట పొలాల దగ్ధం సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని రైతులు తమ పంట పొలాలలో వ్యర్థాలను కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం లో వేగంగా మంటలు కదిలాయని దీంతో మంటలను అర్పడం ఇబ్బందిగా మారిందన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పంట భూములకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఈ విషయాన్ని గమనించి ఇతరులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. తీవ్రమైన ఎండలతో అగ్గి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.






