17 May, 2026 | 5:25 PM

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

17-05-2026 04:39 PM

నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం, వీర్లపాటెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ​టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.